పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించిన శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు

ఉపాధ్యాయుల సహకారం ఉంటే విద్యార్థులు ఏ స్థాయిలో అయినా చేరుకోగలరు

ప్రధానోపాధ్యాయులు గుండోజు దేవేందర్

న్యూస్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కిరాణా వర్తక సంఘం భవనం నందు 20 సంవత్సరముల తర్వాత శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని, గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ, బాల్యాన్ని నెమ్మరు వేసుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పరిచయ కార్యక్రమాలు అనంతరం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థులు సన్మానించి, చిన్న జ్ఞాపకార్ధంగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండుజు దేవేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని గుర్తు ఉంచుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు చిన్ననాటి నుంచి మంచిగా చదివి ఈ స్థాయిలో ఉన్నారు అంటే మన పాఠశాల కృషి అని, ఉపాధ్యాయుల సహకారం ఉంటే విద్యార్థులు ఏ స్థాయిలో అయినా చేరుకోగలరు అని మీరు నిరూపించారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు మీరు బాల్యంలో చేసిన అల్లరి పనులు గుర్తుకొస్తున్నాయి అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పూర్వ సమ్మేలానికి ముందుండి నడిపిన గుగులోతు రాజశేఖర్, వల్లాల ప్రశాంత్, స్రవంతి, అభినవ్ ని తోటి విద్యార్థులు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన సందర్భంగా ఘనంగా శాలువాతో సత్కారం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండోజు దేవేందర్, ఉపాధ్యాయులు కృష్ణమాచారి, శేఖర్, లక్ష్మణ్, కమల, సంధ్యారాణి, విధులత, గుండోజు సురేందర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *