తెలంగాణ ఎక్స్ ప్రెస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల గ్రామపంచాయతీ చుట్టూ ప్రహరీగోడ లేక నిత్యం ఆవులు. గేదెలు మరియు కుక్కలు చొరబడి పంచాయతీ ఆవరణలో పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న క్రమంలో సర్పంచ్ పుష్పలత తిరుపతి ఆలోసించి మూగ జీవులు లోపలికి రాకుండా తాత్కాలిక కంచె ఏర్పాటు చేశారు.
ప్రతిరోజు గ్రామపంచాయతీ కార్మికులు ఆవరణ శుభ్రం చేసేవరకు వాడలలో తిరగడానికి అదనపు సమయం కేటాయించడం జరుగుతుందని వాళ్ళ సమస్యను దృష్టిలో పెట్టుకొని కంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నూతనంగా నిర్మించిన పలిమెల గ్రామపంచాయతీకి ప్రహరీగోడ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దందేర కామేశ్వరి గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.