హైదరాబాద్, కార్వాన్: అయోధ్యలో నిర్మించ తలపెట్టిన అఖిల భారత పద్మశాలి సత్రం భవన నిర్మాణానికి ధర్మకర్తగా ఎన్నికైన కార్వాన్ శ్రీ శివ మార్కండేయ దేవాలయ కమిటీ అధ్యక్షులు, పద్మశాలి సంఘం కోశాధికారిగా దశాబ్దకాలంగా సేవలందిస్తున్న అతిపముల నర్సింగ్‌రావు గారిని కార్వాన్ మార్కండేయ భవన్‌లో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నర్సింగ్‌రావు, సరళ దంపతులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అంబటి సంతోష్, కార్వాన్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గంజి రఘునాథ్, సలహాదారులు చెన్న నరేందర్, దోర్నాల ప్రసాద్, ముదిగొండ యాదగిరి, దావత్ నర్సింగ్, చిత్రాల చంద్రశేఖర్, కందగట్ల సత్యనారాయణ, రూపేందర్ కుమార్ తదితరులు పాల్గొని సన్మానించారు.

అదేవిధంగా కార్వాన్ ట్రస్ట్ సభ్యులు, పద్మశాలి సంఘం, పద్మశాలి మహిళా సంఘం, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని నర్సింగ్‌రావు సమాజానికి అందించిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ, అతిపముల నర్సింగ్‌రావు అయోధ్య సత్రం నిర్మాణానికే కాకుండా శ్రీశైలం, యాదాద్రి, తిరుపతి, కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో పద్మశాలీలకు వసతి సదుపాయాలు కల్పించే కార్యక్రమాలకు కూడా సహకారం అందిస్తున్నారని తెలిపారు. పద్మశాలి కులస్తులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు నర్సింగ్‌రావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Avatar photo

By Murthy