వెబ్ న్యూస్ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఎంతోమంది పేద కుటుంబాలను గుర్తించి వారికి కొంతమందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది అలాగే త్వరలో రాబోయే రెండవ విడతలో కూడా ప్రభుత్వం మరి కొన్ని పేద కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయబోతుంది ఎవరు ఆందోళన చెందవద్దు అన్నారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి,ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, తదితరులు ఉన్నారు.