తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్ గోపినగర్, నెహ్రూనగర్ లలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్యుమరేషన్ ప్రక్రియలో సంబంధిత అధికారులతో, స్థానిక వాసులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వయంగా స్థానికుల ఎన్యుమరేషన్ ఫారాన్ని పూరించి సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం, కార్పొరేటర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR) తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించబడిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13సార్లు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం 14వ సారి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి అర్హులైన ఓటర్లను చేర్చడం, అనర్హులను తొలగించడం అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం ద్వారా ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి సందేహాలు లేకుండా నిర్ణీత గడువులోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమంలో పాల్గొని ఎన్యుమరేషన్ ఫారం నింపేలా బూత్ ఏజెంట్లు చొరవ తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పర్వీన్ బేగం, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఖాదర్ ఖాన్, షైబాజ్, జావీద్, ఇంతియాజ్, మహేందర్ సింగ్, సల్మాన్, టిల్లు, బబ్లు, దస్తగిర్, షాదిక్, పాషా, వహీదా బేగం, రఫీక్, వినయ్, రఘు, రాజేష్, బూత్ లెవెల్ ఆఫీసర్లు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.