తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అలావుద్దీన్ పటేల్ సహకారంతో సిఆర్ ఫౌండేషన్ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగ అలావుద్దీన్ పటేల్ మాట్లాడుతు, స్థానిక వాసులందరూ ఈ ఉచిత వైద్యసేవలను సద్వినియోగం చేసుకొని మరింత బలమైన, ఆరోగ్యకరమైన కొండాపూర్‌ను నిర్మిద్దాం అని మీ ఆరోగ్యం, శ్రేయస్సే మా ప్రథమ ప్రాధాన్యత అని మన సమాజానికి మద్దతుగా సిఆర్ ఫౌండేషన్ సమగ్ర ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.