తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.530కోట్ల మియాపూర్ ఆల్విన్ 6-లేన్ల ఫ్లైఓవర్, రెండు అండర్‌పాస్ బ్రిడ్జిలు హఫీజ్‌పేట్ నుండి మియాపూర్ , బాచుపల్లి నుండి ఆల్విన్ వైపు, రోడ్డు విస్తరణ పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి సృజన, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకెపూడి గాంధీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో వారితో పాటు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పురోగతిని అధికారులు వారికి వివరించారు.