తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలి, స్ట్రీట్ నంబర్ 3లో నూతనంగా ఏర్పాటు చేసిన జీకేఎస్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కుమార్ ప్రత్యేక ఆహ్వానం మేరకు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, జీకేఎస్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ డాక్టర్ కుమార్ కు అభినందనలు తెలియజేస్తూ, ఆసుపత్రి ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని , జీకేఎస్ హాస్పిటల్ మరింత అభివృద్ధి చెంది, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
