తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యాహ్నం ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని, దీంతో తాము సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తోందని వివరించారు. అందువల్ల తమ పని వేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు అధికారికంగా నిర్ణయించి, నెలవారీ వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే తమకు సమగ్ర శిక్ష పథకం కింద పనిచేసే సిబ్బందికి మాదిరిగా 12 నెలల వేతనం చెల్లించాలని కోరారు. ప్రతి నెలా రెండు సెలవులు మంజూరు చేయడంతో పాటు, నెలవారీ వేతనాన్ని ప్రతి నెల 5వ తేదీలోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తక్కువ వేతనంతో ఎక్కువ సమయం పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి, సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను కోరారు.