తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షులు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకిస్తూ, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద గుడిసెలు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం కావడం సంతోషకరమని, చెరువుల పరిరక్షణతో పాటు వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విప్ మహేందర్ రెడ్డి ,సినీ నటుడు నాగార్జున, హైడ్రా కమిషనర్ ఏవి. రంగనాథ్, సిఎంసి కమిషనర్ సృజన, లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.