• పద్మశాలి కులబాంధవులకు కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి పిలుపు

• కార్యక్రమ వివరాలు: నవంబర్ 29, ఆదివారం | ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు | వేదిక: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం, ఎర్రగట్టుగుట్ట, హనుమకొండ.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హనుమకొండ: కార్తీకమాస వనభోజన మహోత్సవంలో పద్మశాలి కులబాంధవులంతా కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) చైర్‌పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, జీడబ్ల్యూఎంసీ మాజీ మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు.

హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 29న ఎర్రగట్టుగుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న కార్తీకమాస వనభోజన మహోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆమె పద్మశాలి నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. కార్తీకమాసం పద్మశాలీలకు ఎంతో పవిత్రమైనదని, కులబాంధవులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. నవంబర్ 29న ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బచ్చు ఆనందం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యం రాజగోపాల్, నేతన్న స్వరాజ్ టీవీ సీఈవో పులికంటి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు నల్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వర్లు, భద్రకాళి దేవస్థానం ధర్మకర్త బింగి సతీష్, పద్మశాలి నాయకులు గుండు పూర్ణచందర్, శ్రీనివాస్, కుసుమ శ్యాంసుందర్, వెంగళ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

Avatar photo

By Murthy