తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్, హుడా కాలనీ సమీపంలోని ద్వార హోటల్ సమీపంలో ఉన్న డ్రైనేజీ రోడ్డుపై పొంగి పొర్లుతూ అసహ్యంగా దారుణమైన దుర్గంధ వాతావరణాన్ని కలుగజేస్తుండటంతో కాలనీవాసులు మనోవేదనకు గురవుతున్న సమాచారాన్ని అందుకున్న సంబంధిత జలమండలి అధికారులు మరుక్షణమే సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగ స్థానికులు మాట్లాడుతు, డ్రైనేజీ రోడ్డుపై పారుతున్నదనే సమస్యను వివరించిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.