తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, బాపునగర్, ప్రశాంతి నగర్ కాలనీలలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణపనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. అనంతరం, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ,బాపునగర్ ప్రశాంతి నగర్ కాలనీల ప్రజలు గత కొన్ని రోజులుగా రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని వారి సమస్యను దృష్టిలో ఉంచుకుని నూతన సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని దాదాపుగా అంతర్గత సీసీరోడ్లు పూర్తవ్వగా మిగిలిన రోడ్లను దశల వారీగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదని డివిజన్ లోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకే మా ప్రాధాన్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపినగర్ అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ రమేష్, శ్రీకాంత్ దేవులపల్లి, జీవన్ ముదిరాజ్, శ్రావణ్ గౌడ్, ప్రభాకర్ గౌడ్‌, నాందేవ్ స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు