తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలో 10వ తేది మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనార్థమై సమీప ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తజనులు మాట్లాడుతూ, శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఇలాంటి మహా భాగ్యం పొందే అవకాశాన్ని కలుగజేసిన ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు.