తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలని, ప్రభుపాద, మసీదుబండ కూడళ్ళలోని ప్రధాన రహదారుల వెంట పాదచారుల కొరకు ఏర్పాటుచేసిన ఫుట్ పాత్ లను మొబైల్ వ్యాపారులు ఇష్టారాజ్యాంగా ఆక్రమించుకుని వారి వ్యాపారానికి సంబంధించిన వ్యర్ధపదార్థాలను, పేపర్ ప్లేట్స్ లను తదితర చెత్తను ఫుట్ పాత్ లపై వదిలేస్తుండటంతో దుర్గంధమైన వాతావరణాన్ని కలుగజేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సంబంధిత సీఎంసి అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఏ ల పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బందితో ఫుట్ పాత్ లపై ఉన్న మొబైల్ వ్యాపారాలను వారి ఇష్టారాజ్యంగా కాకుండా సరైన క్రమ పద్ధతిలో క్రమబద్ధీకరించి పాదచారులకు ఆటంకం లేకుండా, వాహనదారులకు రోడ్లపై ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పాదచారులు మాట్లాడుతు, విధి నిర్వహణలో అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ ఆరోగ్యవాతావరణాన్ని కల్పించి పాదచారులకు ఇబ్బంది లేకుండా ఫుట్ పాత్ లను అందుబాటులోకి తెచ్చినందుకు సంబంధిత అధికారులను, పారిశుద్ధ సిబ్బందిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.