తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: విద్యకు మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉందని అలాంటి విద్యకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబా పూలే బిసి ఓవర్సీస్ విద్యా నిధి స్కీమ్ కింద రౌలకోల వంశీ విదేశీ విద్యకు అర్హత పొందాడు మేరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి సంబంధిత పత్రాన్ని మంగళవారం పార్టీ కార్యాలయంలో బండి రమేష్ సదరు విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నత విద్యను చదవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజ అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో విదేశాలు వెళ్లి ఉన్నత చదువులు చదివిన వారు డబ్బు సంపాదించి తిరిగి మాతృదేశానికి రావాలని ఇక్కడ సేవలు అందించాలని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విద్యార్థికి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, నాగార్జున , శ్రీనివాస్ బాబు , మస్తాన్ రెడ్డి, క్రాంతి, లక్ష్మయ్య, బాలరాజు,రమణ, ఆసిఫ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.