తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రజాప్రభుత్వం దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం ఆనందంగా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఈ స్పందన ప్రజలకు మరింత సేవ చేయాలనే బాధ్యతను, రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా సొంత ఇంటి కోసం ఎదురుచూసిన లక్షలాది పేద కుటుంబాలు తమ ఇందిరమ్మ ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. పేద కుటుంబాల ముఖాల్లో చిరునవ్వులు, వారి ఆనందం, భావోద్వేగాలు మరిచిపోలేని అనుభూతిని కలిగించాయని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నివాసాలు మాత్రమే కాదని, పేదల ఎన్నో ఏళ్ల కలలకు సాకారమని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది సహా ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

You missed