తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : యాదవ సోదరుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటిచెప్పే సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు.
రవి యాదవ్ సదర్ సమ్మేళనం నాలుగో వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులను, పశువులను కాపాడిన ఘట్టానికి ప్రతీకగా యాదవ సోదరులు సదర్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని వివరించారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మేళనం కమిటీ చైర్మన్ ఏనుగుల రవికుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, 58వ డివిజన్ అధ్యక్షుడు వరికుప్పల శివ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధరావత్ స్వామి నాయక్, డేరింగుల వంశీ చెర్రీ, రాజేందర్, మహేందర్ యాదవ్, కౌశిక్ కుమార్ యాదవ్, శేషాంక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
