తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, హఫీజ్పేట్ మంజీరాలైన్, దీపావళి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలు ఉత్సాహంతో బాణాసంచాలను భారీఎత్తున పేలుస్తూ దీపావళి పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో బాణాసంచాల వ్యర్థాలతో రోడ్లు, రహదారులు బాణాసంచాల వ్యర్థాలతో నిండిపోయాయి. సిఎంసి అధికారుల ఆదేశాల మేరకు వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది కలగకూడదనే సదుద్దేశ్యంతో మరుసటి రోజు తెల్లవారుజామునే ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఎ ల పర్యవేక్షణలో పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను శుభ్రంగా తొలగించారు. ఈ సందర్బంగ స్థానికులు మాట్లాడుతు, దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం అందరికీ తెలిసిందేనని ఈ నేపథ్యంలో బాణాసంచాల వ్యర్ధాలు రోడ్లపై రహదారులపై పడిపోతుంటాయని వాటిని శుభ్రంచేసేందుకు మరుసటి రోజు తెల్లవారుజామునే పారిశుద్ధ్య సిబ్బంది విధులకు హాజరై వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను సంబంధిత అధికారులను అభినందిస్తున్నామని వారు విధి నిర్వహణలో అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతున్న వారి శ్రమ అభినందనీయమని అన్నారు.
