తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: అనారోగ్యానికి గురైన పార్టీ నాయకులను టీపీసీసీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సోమవారం పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకులు పొడుగు అప్పారావు, సాయిబాబా చౌదరి ఇటీవల హుద్రోగానికి గురయ్యారు చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రమేష్ వారి స్వగృహానికి వెళ్లి నాయకులను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంటుందని వారి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటుందన్నారు. ఇరువురు నాయకులు త్వరగా కోలుకుని వారు తిరిగి రోజు వారి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు , కొప్పిశెట్టి దినేష్, అరవింద్ రెడ్డి, శ్రీనివాస్ బాబు, నాగార్జున ,రాజేష్ శంకర్ గౌడ్, చావా శ్రీనివాస్, ప్రవీణ్ , శివ చౌదరి , రామారావు, సురేష్, రవి ,బచ్చుమల్లి , బాబ్జీ , మనిగౌడ్ , నవాజ్ , సంధ్య,రజిని తదితరులు పాల్గొన్నారు.
