తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని హస్మత్‌పేట డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు సహన్ష అరవింద నాయుడు ఆధ్వర్యంలో పలువురు సోషల్ వర్కర్స్ మురళీ, కృష్ణంరాజు, హర్షబ్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరై కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పనితీరు నచ్చి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో ప్రజలు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని త్వరలో మరిన్ని చేరికలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కొత్త వారితో సమన్వయంతో వ్యవహరించి పార్టీ అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్,కిరణ్, పుష్పారెడ్డి, రాజేందర్ , రాము, ఇజాజ్, అరుణ్ గౌడ్, సతీష్, ముస్తఫా, లక్ష్మణ్ గౌడ్, సుజిత్, అంజాద్, విజయలక్ష్మి, మనీషా తదితరులు పాల్గొన్నారు.
