తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అనంతరం, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని యలమంచి ఉదయ్ కిరణ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ కు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి పర్వదినం వారి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయసంపదలను నింపాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి స్ఫూర్తితో ప్రజాసేవ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు దిశగా మరింత అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీ నాయకులు, లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్ నాయకులు, పార్టీ కార్యకర్తలతో పాటు మియాపూర్ డివిజన్ నాయకులు వంశీ, నవీన్, చిరంజీవి, ప్రవీణ్, నాగసాయి, గురువులు, సాయి లోహిత్ తదితరులు పాల్గొన్నారు
