తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముకుంటుందన్న కూకట్‌పల్లి శాసనసభ్యుడు విమర్శలను టిపిసిసి ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తిప్పి కొట్టారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం పైనా, ప్రభుత్వ భూముల అమ్మకాలపైన బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. దమ్ముంటే కృష్ణారావు తను చేసిన ఆరోపణలపై నిలబడాలంటూ ఆయన చాలెంజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములను అమ్ముకుంటోoదంటూ కూకట్‌పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు శుక్రవారం చేసిన ఆరోపణలపై రమేష్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై శనివారం నియోజకవర్గ పార్టీ కార్యాలయం హేమదుర్గ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కృష్ణారావు విమర్శలను తిప్పి కొట్టారు ముఖ్యమంత్రిపై విమర్శలు చేసేటప్పుడు నోరు సంభాళిoచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే కృష్ణారావు ఇతర బీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు రాష్ట్రం నెత్తిన పెట్టి పోయిందన్నారు. చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు అక్రమ నిర్మాణాలకు కృష్ణారావు, అతని అనుచరులే ఆద్యులని రమేష్ ధ్వజమెత్తారు. కేవలం హౌసింగ్ బోర్డ్ అభివృద్ధికి తాను 2వేలకోట్ల రూపాయలు వెచ్చించానని కృష్ణారావు చెప్పడాన్ని రమేష్ ప్రశ్నించారు. దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు కెపిహెచ్బి కాలనీలో ఒక స్కూలు ఒక ఆసుపత్రి కూడా కట్టలేక గత ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. స్కూల్ కోసం తెచ్చిన స్టీల్ సైతం టిఆర్ఎస్ నాయకులు అమ్ముకున్నారని రమేష్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన కృష్ణారావు కూకట్పల్లికి ల్యాండ్ మార్క్ గా తను ఏం చేశాడో చూపించాలన్నారు. తన 12ఏళ్ల హయాంలో పేద ప్రజల కోసం కృష్ణారావు ఎన్ని ఇళ్లు కట్టించాడో చూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రమేష్ పేర్కొన్నారు. ఐటీ, పారిశ్రామిక, ఇతర ఉత్పాదకరంగాల్లో రాష్ట్రం ముందంజ వేసింది అన్నారు ఎల్ నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా100 దేశాల్లో కరువు వస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టి టిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వారిని మోసం చేయాలని చూస్తున్నారన్నారు కరువు నివారణ కోసం తాగునీరు సాగునీరు ఏర్పాటుకోసం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ బోర్డ్ లో 11ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని 400ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని రెండో విడతలో మరో మూడు వేల ఇళ్ళ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని రమేష్ తెలిపారు. తాను, అధికారులు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి డివిజన్లో ప్రతిరోజు పర్యటిస్తున్నామని పేద ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని రమేష్ పేర్కొన్నారు.