తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 31,59,000.రూ. ముప్పై ఒక లక్ష యాబై తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కుల ను 130మంది బాధిత కుటుంబాలకు తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి అందచేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 31,59,000.రూ. ముప్పై ఒక లక్ష యాబై తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కుల ను 130మందికి అందచేయడం చాలా సంతోషంగా ఉందని తెలియచేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పునరుద్గాటించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ఈ సందర్బంగా తెలియచేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా అండగా నిలుస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలియచేశారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్ , కోనేరు ప్రసాద్, మరేళ్ళ శ్రీనివాస్, పోతుల రాజేందర్, ఎమ్డీ ఇబ్రహీం, యెల్లం నాయుడు, కావూరి అనిల్, మంజుల, లక్ష్మమ్మ, లక్ష్మీ అష్రఫ్ , సలావుద్దిన్, యాసిన్ , తదితరులు పాల్గొన్నారు.