తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ డివిజన్ విద్యుత్ శాఖ విభాగ ఇంజినీర్ గరుత్మంత రాజును ఇతెహద్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన అధికారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సేవలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ సర్కిల్ అధ్యక్షుడు షేక్ అహ్మద్, ఉపాధ్యక్షుడు రియాజుద్దీన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి జావీద్, డివిజన్ అధ్యక్షుడు ఎం.డి. జహంగీర్, ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఖాజా పాషా, కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ స్వామి, సంయుక్త కార్యదర్శి ఘాజీ, వ్యవస్థాపక కార్యదర్శి షేక్ వహీద్, వెంకట్రాములు తదితర ఎంప్లాయీస్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

You missed