తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  నార్సింగి సర్కిల్ పరిధిలో రూ.6 కోట్ల 48 లక్షల 60 వేల విలువైన వివిధ అభివృద్ధి పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా నార్సింగి వార్డు 124లో వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద పశువుల షెడ్ నిర్మాణం, ఖానాపూర్, గండిపేట వార్డు 126లో గ్రంథాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు..అలాగే నార్సింగి పరిధిలోని పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, నార్సింగి హైట్స్‌లో పార్కు, కుక్కల పార్కు కోసం ప్రహరీ గోడ నిర్మాణం తదితర పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కాలనీల వారీగా సమస్యలను పరిష్కరిస్తూ రోడ్లు, పార్కులు, ఇతర ప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

You missed