తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని సున్నం చెరువు అభివృద్ధి పనులను గాయత్రి నగర్ డివిజన్ అధ్యక్షులు మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ శనివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ చెరువును కబ్జాదారులు సగానికి పైగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. వీటిని తొలగించి చెరువును రాష్ట్ర ప్రభుత్వం సర్వాంగ సుందరంగా హైదరాబాద్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తోంది ఈ చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయిన వెంటనే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను రమేష్ పరిశీలించారు. జరుగుతున్న పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, సున్నం చెరువు అభివృద్ధి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా తీసుకుందన్నారు. వాకింగ్ ట్రాక్ సెక్యూరిటీ గ్రీనరీ తదితర అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువుల్లో కబ్జాలను తొలగించి వాటిని పునరుద్ధరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందన్నారు ఇకపై హైదరా బాద్ చెరువుల్లో కబ్జాలు చేసే పరిస్థితి ఉండదన్నారు. అదేవిధంగా గాయత్రి నగర్ నుంచి వంద ఫీట్ల రోడ్డుకు కనెక్టివిటీ రోడ్డును ఏర్పాటు చేయాలన్న స్థానికుల కోరికను మన్నించి స్థానిక రహదారిని అభివృద్ధి చేస్తామన్నారు. ఏం సి చైర్మన్ పుష్పారెడ్డి, డివిజన్ అధ్యక్షులు వాజిద్ పాషా, క్రాంతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల సత్యం , కనకయ్య, నరసింహ , రంగమోహన్, బర్కతలి, ప్రకాష్ ముదిరాజ్ , నజీర్ ,లడ్డు, అడ్వాని అనిల్, రమణ, రవి , పిడికిటి గోపాల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.