తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని శ్రీ హేమ దుర్గా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజా నాయకులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో *డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను విజయవంతంగా కొనసాగిస్తోందని, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం, ఈ జన్మదిన వేడుకల సందర్భంగా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, మహిళా, పురుష కార్మికులకు బండి రమేష్ చేతుల మీదుగా గోడ గడియారాలను* పంపిణీ చేశారు. నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికుల సేవలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.