తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాపోలు సత్తయ్య హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. సమాజంలో ప్రేమ, సోదరభావం, ఐక్యత వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.