తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్ కాలనీలో నివసించే చంద్రయ్య బట్టల ఇస్త్రీ దుకాణంలో ఇటీవల షాట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు షాప్ కాలిపోవడంతో జీవనాధారం కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రయ్యకు నేనున్న అంటూ భరోసా అందిస్తూ ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సహకారంతో తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ చేతులమీదుగా ఇస్త్రీ పెట్టే, బియ్యము, నిత్యవసర సరుకులు అందించారు. సహాయం పొందిన బాధితుడు ఎమ్మెల్యే గాంధీకి, తాజా మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, మరేళ్ళ శ్రీనివాస్, ఎండి ఇబ్రహీం, శేఖర్, మంజుల, అష్రఫ్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
