తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: మూసాపేటలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదవ సోదరులు నిర్వహించిన సదర్ ఉత్సవానికి టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, మన పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తాయని అలాంటి పండుగలను ప్రజలందరూ కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. పండుగలను అన్ని మతాలవారు కలిసికట్టుగా జరుపు కోవడంఅభినందించదగ్గ విషయం అన్నారు . ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తూము వేణు, తూము సంతోష్, ఎల్ ఎస్ యాదవ్, తూము వినయ్, రజనీకాంత్, నవాజ్ ,ముస్తఫా, పెంటయ్య ,శేఖర్ గౌడ్, నర్సింగ్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.