తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి విలేజ్, గంగారాం, రాయదుర్గం పలు ప్రాంతాలలో దీపావళి పండుగ శుభ సందర్భంగా నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమాలలో పఠాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకులైన మిరియాల రాఘవరావు పాల్గొన్నారు. నిర్వాహకులు మిరియాల రాఘవరావును గౌరవప్రదంగా స్వాగతించి ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగ మిరియాల రాఘవరావు మాట్లాడుతు, సదర్ సమ్మేళనం అంటేనే యాదవ సోదరుల ఐక్యతకు ప్రతీక అని అన్నారు. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను కలుగజేయాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.