తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ మక్తా మహబూబ్పేట్ డివిజన్ పరిధిలోని నివృతి హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, ముందస్తు వైద్య పరీక్షలు మరియు నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ తెలిపారు. ఈ వైద్య శిబిరం శనివారం, నవంబర్ 14న ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 3:00గంటల వరకు, నివృతి హోమ్స్ కమ్యూనిటీ హాల్, సెంఠియా గ్లోబల్ స్కూల్ ఎదురుగా, బీకే ఎన్క్లేవ్, మియాపూర్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నివృతి హోమ్స్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ సహకారం అందిస్తున్నాయి. ఉచితంగా అందించే వైద్య సేవలు: శిబిరంలో ప్రజలకు ఈసీజీ పరీక్ష, బీపీ పరీక్ష, ఆర్థోపెడిక్ వైద్య పరీక్ష, ఎముకలకు సంబంధించిన పరీక్షలు, కంటి పరీక్ష, ఈఎన్టీ పరీక్షలు, కన్సల్టేషన్, కార్డియాలజీ కన్సల్టేషన్, శిశు వైద్యుల కన్సల్టేషన్, గైనకాలజీ కన్సల్టేషన్, జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్, ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ ఉచితంగా అందించనున్నారు. అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు ఉచిత మందులు మరియు వైద్య చికిత్స అందించనున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందాల్సిన అవసరం ఉన్న ప్రజలకు ఉచిత రవాణా మరియు భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గత వైద్య శిబిరాల ద్వారా అనేక మందికి ఉచితంగా మెరుగైన వైద్యం ఇదే విధంగా గతంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల ద్వారా పలువురు పేదలు , అవసరమైన వారు ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, కంటి ఆపరేషన్లు, ప్రసవ సేవలు, వివిధ రకాల శస్త్రచికిత్సలు వంటి అనేక వైద్య సేవలను పొందారని నిర్వాహకులు తెలిపారు. అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు తదుపరి చికిత్సలు కూడా అందిస్తూ, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ట్రస్ట్ కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య సేవలందించేందుకు సహకరిస్తున్న మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ యాజమాన్యానికి యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించడంలో మమతా హాస్పిటల్స్ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకోవడం, అవసరమైన వైద్య సలహాలు పొందడం ద్వారా పలు ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యలమంచి ఉదయ్ కిరణ్, సమాజ సేవ, విద్య, ఆరోగ్యం, యువత సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , చైర్మన్‌గా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అవసరమైన వర్గాలకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు ఉచిత వైద్య మరియు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా పలు పురస్కారాలు సామాజిక సేవా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా యలమంచి ఉదయ్ కిరణ్‌కు హానరరీ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ – ఇంటర్నేషనల్ జీహెచ్‌పీ యూనివర్సిటీ, సేవా రత్న నేషనల్ అవార్డు ఫర్ హ్యూమానిటేరియన్ సర్వీస్, బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు, ప్రెస్ వింగ్స్ క్లబ్, సేవా రత్న అవార్డు, కమ్మ ఐకాన్ ట్రస్ట్, అబ్దుల్ కలాం నేషనల్ సేవా రత్న పురస్కారం, విశ్వ ఆర్ట్స్ & మేనేజ్మెంట్ కళాక్షేత్రం తదితర పురస్కారాలు లభించాయి. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి మియాపూర్ , పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
