తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో కొడవల్లి గోవర్ధని ఆహ్వానం మేరకు నిర్వహించిన హన్నిస్ డిజైనర్ స్టూడియో 9వ వార్షికోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్టూడియో నిర్వాహకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ మరింత అభివృద్ధి సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, అరవింద్ రెడ్డి, రాజేష్, గౌడ్ శ్రీనివాసబాబు సాయిబాబా చౌదరి బాబ్జి చావా శ్రీనివాస్ , రామారావు, రమణ , నలిని కాంత్ ,కళ్యాణ్, రవి , బొచ్చు మళ్ళీ, ఆవుల వేణు , సంధ్య, వాణి, సుజాత, సరోజ తదితరులు పాల్గొన్నారు
