తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జట్టు ఉప్పల్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక పీసీఎల్.6 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న సందర్బంగ మియాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జట్టుకు కాంగ్రెస్ సీనియర్ లీడర్ బలరామ్ యాదవ్ ఆర్థిక తోడ్పాటును అందించారు. ఈ సందర్భంగా పానుగంటి గణేష్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు బలరామ్ యాదవ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బలరామ్ యాదవ్ మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణను, ఉత్సాహాన్ని నింపుతాయని, స్థానిక అసోసియేషన్ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ10,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.
