తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలోని సమస్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ది పనులపై ఈ రోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దక్షిణ విభాగం కమాండెంట్ విక్రమ్, ఇంజనీరింగ్ విభాగం అధికారి కృష్ణ ఉపాధ్యాయ , సీఎమ్సీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి నడిగడ్డ తాండలో పర్యటించి పరిశీలించిన మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగినదని, నడిగడ్డ తండాలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, యూజీడీ పైప్ లైన్ నిర్మాణపనులు చేపట్టే పరిసర ప్రాంతాలను సిఆర్పిఎఫ్ అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించడం జరిగినదని. నడిగడ్డ తండ నుండి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బొల్లారం రోడ్డు పక్కన మురుగు నీరుచేరి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, యూజీడీ పైప్ లైన్ నిర్మాణం పనులకు అనుమతులు ఇప్పిస్తే వెంటనే పనులు చేపట్టి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, మురుగు నీరు మళ్లింపు ద్వారా కాలనీలో ప్రశాంతమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో నడ్డిగడ్డ తండాలో ఎన్నో ఏండ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, నడిగడ్డ తండా అభివృద్ధికి కృషి చేస్తామని,నడిగడ్డ తండాలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగినది అని, నడిగడ్డ తండాలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, యూజీడీ నిర్మాణ పనులను కూడా త్వరలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని శ్రీకాంత్ తెలియచేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దక్షిణ విభాగం సంబంధిత అధికారులు పై అంశాలపై సానుకూలంగా స్పందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధిత అధికారులు, సీఎమ్సీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఏఈ. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు