తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చేయూత పింఛన్లను మంజూరు చేయడంపై కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వేలాది కొత్త పింఛన్లు మంజూరు కావడం పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే విషయమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ అందించడం ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. అర్హత ఉండి కూడా ఇప్పటివరకు పింఛన్ పొందని వారు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.