తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్ సురభి కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరబోయిన రవి యాదవ్ ప్రారంభించారు. శేరిలింగంపల్లి డివిజన్ ప్రాంతాల ప్రజలకు పార్టీ కార్యాలయం ద్వారా అందుబాటులో ఉండి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి కృషి చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఈ కార్యాలయం ప్రధాన ఉద్దేశమని మరబోయిన రవి యాదవ్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా వేదికగా ఈ కార్యాలయం పనిచేస్తుందని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.
