తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్ నెహ్రూనగర్ లో స్థానిక నాయకులు దేవులపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ వేద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏం.డి అరవింద్ రెడ్డి, డాక్టర్ పూర్ణిమ, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, నర్సింహా, హరి, ప్రదీప్, మహేందర్ సింగ్, రవీందర్, సైదులు యాదవ్, సలీం, సల్మాన్, షైబాజ్, రవీందర్, రఘు, సూరి, రాజేష్, వినయ్, నాందేవ్, హాస్పిటల్ వైద్య సిబ్బంది స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.