తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ఆర్జీకే కాలనీలోని ఆర్జీకే ఆటో స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన హిటాచీ మనీ స్పాట్ ఏటీఎమ్ ప్రారంభోత్సవానికి హిటాచీ మనీ స్పాట్ ఏటీఎమ్ నిర్వాహకులైన రేవళ్ల రాజేష్ ,సుజిత్ ల ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై ఏటీఎమ్ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ , సుజిత్ లను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఏటీఎమ్ కేంద్రం సౌకర్యవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.