తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పీఎం శ్రీ జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఎస్ ఏ మ్యాధ్స్ బెస్ట్ టీచర్ గా పద్మావతి, ఎస్ఏ బయోసైన్స్ బెస్ట్ టీచర్ గా పద్మజ రంగారెడ్డి జిల్లా ప్రభావ శీలమైన ఉపాధ్యాయులుగా రాణిస్తూ, మరియు బోధనలో ఆదర్శవంతమైన ప్రతిభ కనబరుస్తున్నందుకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ తరపున అభినందన పూర్వకముగా ప్రశంసింస్తూ వారికి రంగారెడ్డి జిల్లా విద్యాధికారి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.