తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హనుమకొండలో ఇటీవల మృతి చెందిన భూపాలపల్లి ఎల్బీనగర్ రెడ్డి కాలనీ పద్మశాలి పరపతి సంఘం సభ్యురాలు గడ్డం లక్ష్మీ దేవమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి సంఘం నాయకులు హాజరై, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎల్బీనగర్ రెడ్డి కాలనీ పద్మశాలి పరపతి సంఘం తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుమారులకు అందజేశారు. కుటుంబానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమనాథుని సత్యనారాయణ, ఖ్యాతం సతీష్, గుండేటి సమ్మయ్య, డాక్టర్ వెంకటస్వామి, భాగవతం బిక్షపతి, షేర్ కుమార్, స్వామి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
