• చేనేత రంగ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ విప్ ఇరవత్రి అనిల్ కుమార్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ తదితరులు హైదరాబాద్లోని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన వీవర్స్ సర్వీస్ సెంటర్ (WSC)ను సందర్శించారు.
ఈ సందర్భంగా వీవర్స్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, చేనేత రంగానికి అందిస్తున్న సేవలు, నేతన్నల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వారికి వివరించారు.
చేనేత రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ సందర్శనలో వివరాలు తెలుసుకున్నారు. చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, నేతన్నలకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు అందించడం, సంప్రదాయ చేనేత కళలకు మరింత గుర్తింపు తీసుకురావడం వంటి అంశాలకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
చేనేత రంగ అభివృద్ధి, నేతన్నల సంక్షేమం, చేనేత ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా ఇటువంటి సందర్శనలు ఉపయోగకరంగా ఉంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
