తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో సర్ సమస్యలు, సవాళ్లు, అభిప్రాయ సేకరణ వంటి పలు అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, దొడ్ల వెంకటేష్ గౌడ్,నార్నె శ్రీనివాస రావు ,వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులతో కలసి పాల్గొన్న మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ . ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రజలకు సర్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసి, అవసరమైన సహకారం అందించాలని కోరారు,ఇంట్లో లేని ఓటర్లకు నోటీసులు, ఓటరు ఇంట్లో లేకపోవడం వల్ల నోటీసు అందజేయలేకపోవడం, వృద్ధులు, ఉద్యోగ రీత్యా బయట ఉన్నవారికి, వలస వెళ్లినవారి విషయంలో నోటీసుల అందజేయటంలో ఇబ్బందులు, చిరునామా మారిన ఓటర్లు పాత చిరునామాలో నోటీసులు రావడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన కుటుంబాల వివరాలు సరిగ్గా లేకపోవడం, మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగడం, పేరు, వయస్సు, చిరునామాలో తప్పులు, ఓటరు పేరు తప్పుగా ఉండటం, వయస్సు, తండ్రి, భర్త పేరు, ఇంటి నంబర్ వంటి వివరాల్లో పొరపాట్లు ఉండటం, పత్రాలు అందుబాటులో లేకపోవడం, నోటీసులో కోరిన పత్రాలు లేకపోవడం లేదా పాత రికార్డులు లభించకపోవడం, ముఖ్యంగా పాత ఓటరు, కుటుంబ రికార్డులను గుర్తించడం కష్టంగా ఉండటం, నోటీసు అందకపోవడం, నోటీసు ఇచ్చినట్లు రికార్డులో చూపించినా వాస్తవానికి ఓటరుకు అందకపోవడం వంటి ఫిర్యాదులు రావటం, ఫామ్6 అందచేసి కొత్తగా ఓటు క్రియేట్ చేయు వంటి అంశాలు ఈ సమీక్షా సమావేశంలో చర్చించటం జరిగింది,సర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా, ప్రజలకు అనుకూలంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు.
