తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని నిర్వహించిన చండీ హోమం, అన్నదాన కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ, దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, తంపి, మోహన్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, వినయ్, బింకీ, అరుణ్, జి.వి. రావు, సిద్దేశ్వర్, సత్యనారాయణ, స్థానిక వాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
