తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్, పీజేఆర్ స్టేడియంలో శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ బోర్డు వైస్ ఛైర్మెన్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పాటలతో, ఆటపాటలతో వేడుకను ఘనంగా జరుపుకున్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మహిళలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ , నిర్వాహకురాలు పూజిత జగదీశ్వర్ గౌడ్ , శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక మహిళలు, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.