• దాస్యం వినయ్ భాస్కర్,నన్నపనేని నరేందర్తో కలిసి ప్రత్యేక పూజలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, వరంగల్: ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆయనతో పాటు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాకతీయుల కాలం నాటి చారిత్రక పుణ్యక్షేత్రమైన భద్రకాళి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా దుర్గామాత అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన రవిచంద్రకు ఆలయ కమిటీ సభ్యులు,అధికారులు,వేద పండితులు మేళతాళాలు,పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం రవిచంద్రతో పాటు దాస్యం వినయ్ భాస్కర్,నన్నపనేని నరేందర్ తదితరులు తమ గోత్రనామాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.పూజల అనంతరం వేద పండితులు వారికి శాలువాలు కప్పి సత్కరించారు.అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు.
భద్రకాళి అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు పూలంగి సేవలు:వద్దిరాజు రవిచంద్ర
వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవస్థానంలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారికి పూలంగి సేవలు నిర్వహించే భాగ్యం తమ కుటుంబానికి లభించడం అదృష్టంగా భావిస్తున్నామని రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీ భద్రకాళి అమ్మవారికి,అమ్మవారి శేష వాహనాలకు వివిధ రకాల పుష్పాలు, గజమాలలతో పూలంగి సేవలు నిర్వహించినట్లు వెల్లడించారు. రంగురంగుల పుష్పాలతో అమ్మవారిని, వాహనాలను సర్వాంగసుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ పవిత్రమైన సేవలో భాగస్వాములయ్యే అవకాశాన్ని తమ కుటుంబానికి కల్పించిన శ్రీ భద్రకాళి అమ్మవారికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.
