తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ ప్రజయ్ షెల్టర్స్ ప్రెసిడెంట్ శంకర్, శ్రీమతి హేమ శంకర్ , వారి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ఆదివారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో, ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వంశీ, ప్రవీణ్, సతీష్, విష్ణు, రాకేష్ తదితరులు, శ్రేయోభిలాషులు, భక్తులు పాల్గొన్నారు.
