తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి సగర (ఉప్పర) సంఘం కార్యాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లింగంపల్లి సగర (ఉప్పర) సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలలో లింగంపల్లి సగర (ఉప్పర) సంఘం సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
