తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మదినగూడ డివిజన్ పరిధిలోని శాంతినగర్‌లో దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించే సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు జ్వాలా సింగ్, రవి, వంశి, త్రిలోచన్ తదితరులు పాల్గొన్నారు.